పేదవారికి అన్నం దొరకట్లేదని యాంకర్‌ రష్మీ ఆవేదన

by సూర్య | Tue, Mar 31, 2020, 01:04 PM

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ జబర్దస్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది. వీధుల్లో కుక్కలు, ఆవులు కూడా ఆహారం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపింది.పేదలకు ఫుడ్‌ దొరకట్లేదని చెప్పింది. దయచేసి అందరూ విరాళాలు ఇవ్వాలని కోరింది. కనీసం ఒక్క రూపాయి ఇచ్చినా సాయం చేసినట్లే అవుతుందని తెలిపింది. విరాళాలు అంటే పెద్ద మొత్తంలో మాత్రమే చెల్లించాల్సిన అవసరం లేదని, చాలా మంది కలిసి ఒక్కో రూపాయి సాయం చేసినా చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. పేదవారు తిండికి దూరమవుతున్నారని తెలిపింది.
ప్లీజ్‌ ప్లీజ్‌ ప్లీజ్‌ వారికి సాయం చేద్దాం అని రష్మీ కోరింది. మన ఇంటి పరిసరాల్లో ఉండే పేదలకు కూడా సాయం చేద్దామని పిలుపునిచ్చింది. సమాజంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితులను తాను ఎన్నడూ చూడలేదని తెలిపింది. విరాళాలు ప్రకటిస్తోన్న వారికి కృతజ్ఞతలు చెప్పింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM