ఆ విషయంలో హీరో ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించాడు

by సూర్య | Tue, Mar 31, 2020, 01:14 PM

అవును భారత దేశంలో అలా చేస్తోన్న మొట్ట మొదటి హీరో ఎన్టీఆర్‌గా రికార్డలకు ఎక్కబోతున్నాడు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌తో పాటు ఈ సినిమా టైటిల్‌ ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత మరో విజువల్ ట్రీట్‌లా కనిపిస్తోంది. ఈ టీజర్‌కు ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ ఓ రేంజ్‌లో ఉంది. ఒక్క తెలుగులోనే కాదు... హిందీలో తమిళంలో,కన్నడలో ఎన్టీఆరే తన వాయిస్ అందించాడు. మలయాళంలో మాత్రం వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు.  ఒక ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కబోతున్న ఓ సినిమాకు ఓ హీరో ఇన్ని భాషల్లో ఓన్ డబ్బింగ్ చెప్పడం ఈ జనరేషన్‌లో ఇదే ప్రథమం అనే చెప్పాలి. అంతేకాదు ఆయా భాషల్లో ఎన్టీఆర్ వాచకం ఎక్కడా తడబడలేదు. ఇక ప్రకాష్ రాజ్ విషయానికొస్తే... ఆయన ఏ భాషలో నటిస్తే.. ఆయా భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాడు. కానీ ఆయన హీరో మాత్రం కాదు. మరోవైపు కమల్ హాసన్, రజినీకాంత్ హిందీ, తెలుగులో నటించేటపుడు మొదట్లో తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకునేవారు.అప్పట్లో ప్యాన్ ఇండియా లెవల్ సినిమాలు లేవు. కానీ ఆయా భాషల్లో నిర్మితమైన చాలా చిత్రాల్లో కమల్, రజినీ కాంత్ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకున్న సందర్భాలున్నాయి. ఈ జనరేషన్ విషయానికొస్తే.. ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాకు ఎన్టీఆర్ ఇలా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఇదే మొదటి సారే అని చెప్పాలి. మరి రామ్  చరణ్ కూడా మిగతా భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడా లేదా అనేది చూడాలి. మొత్తానికి ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ మలయాళం తప్ప అన్ని భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న మొదటి భారతీయ హీరోగా రికార్డలకు ఎక్కబోతున్నాడు.

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM