కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేచి చూస్తున్నాను : సింగర్ కనిక కపూర్

by సూర్య | Mon, Mar 30, 2020, 12:49 PM

కరోనా వైరస్ బారిన పడిన గాయని కనిక కపూర్ కు నాలుగో సారి నిర్వహించిన పరీక్షల్లో కూడా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. తాను ఐసీయూలో లేనని... తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది. తదుపరి పరీక్షలో తనకు నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నానని చెప్పింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేచి చూస్తున్నానని తెలిపింది. వారిని ఎంతగానో మిస్ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నెల 20న కనికాను ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. మార్చి 23, 27 తేదీల్లో నిర్వహించిన టెస్టుల్లో కూడా పాజిటివ్ అని తేలింది. ఆమెపై పోలీసు కేసు కూడా నమోదైంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM