ప్రభాస్ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది!

by సూర్య | Fri, Jan 17, 2020, 02:52 PM

దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 1960ల నాటి ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే మొదటిసారి ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. సాహో చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. సినిమా కథ రీత్యా చాలా భాగం యూరప్ లో చిత్రీకరించాల్సి ఉండగా, చాలా వరకు సెట్స్ వేసి చిత్రీకరిస్తున్నారు. ఏదైతేనేమి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూసిన, అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన అప్డేట్ వచ్చేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆయన ఓ ఫోటో స్టిల్ పంచుకోవడంతో పాటు, లేటెస్ట్ మూవీ షూట్ తిరిగి మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. అలాగే ఈ షెడ్యూల్ చాలా ఫన్ రైడ్ లా ఉంటుందని డిస్క్రిప్షన్ పెట్టారు. ఓ విలాసవంతమైన వింటేజ్ భవంతిలో పురాతన పియానో, గోడలపై చాలా ఫోటో గ్రాఫ్స్ ఉండగా వాటి వైపు ఆసక్తిగా చూస్తున్న ప్రభాస్ లుక్ ఆసక్తి రేపుతోంది. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రభాస్ సూపర్ హిట్ కొట్టడం ఖాయం.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM