'ఫైటర్‌' కోసం థాయ్‌లాండ్‌ వెళ్లిన విజయ్‌ దేవరకొండ!

by సూర్య | Thu, Jan 16, 2020, 07:02 PM

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఫైటర్‌'.  పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. హిందీ వెర్షన్‌కు కరణ్‌ జోహార్‌ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ కోసం విజయ్‌ థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. అయితే విజయ్‌ థాయ్‌లాండ్‌ ఎందుకోసం వెళ్లాడనేదానిపై నిర్మాత ఛార్మి స్పష్టత ఇచ్చారు. అక్కడ విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నట్టు ఛార్మి తెలిపారు. మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ చిత్రంలో విజయ్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం విజయ్‌ చాలా కఠోర సాధన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణకు సంబంధించి ఛార్మి.. ఓ వీడియో కూడా విడుదల చేశారు. అందులో విజయ్‌కు శిక్షణ ఇస్తున్న ట్రైనర్‌ను పరిచయం చేశారు.

Latest News
 
'ది 100' టీజర్ అవుట్ Fri, Apr 26, 2024, 05:29 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM