విజయ్ 'మాస్టర్' నుంచి కొత్త పోస్టర్!

by సూర్య | Thu, Jan 16, 2020, 05:47 PM

తమిళ హీరో విజయ్ అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో బాలనటుడిగా సినీరంగంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మరోసారి తన తండ్రి దర్శకత్వంలోనే "నాలయ తీర్పు" (1992) లో నటించాడు. అయితే విజయ్ కి మాత్రం హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది 1996లో విడుదలైన "పూవె ఉనక్కాగ". విజయ్ నటించిన సినిమాలు తెలుగు లో డబ్ అవుతున్న విషయం తెలిసిందే.. తాజాగా విజయ్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నమూవీ 'మాస్టర్' . ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. గతంలో ఈ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మాస్టర్' మంచి హిట్ అయ్యింది. తాజాగా 'మాస్టర్' సినిమా నుంచి సెంకండ్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ పిక్ లో విజయ్ నల్ల చోక్కా, నల్ల కళ్లజోడు పెట్టుకుని ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. సైలెన్స్ అంటూ అతను చేసే సైగపై నెట్టింట్లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాస్టర్ నయా పిక్ ట్రెండింగ్ మారింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM