పునర్నవి పేరెంట్స్‌ని రాహుల్ ఎందుకు కలిసాడో తెలుసా?

by సూర్య | Thu, Jan 16, 2020, 05:32 PM

రాహుల్, పునర్నవి బిగ్ బాస్ 3 కోసం ఒకే ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం ప్రేమగా మారిందని అందరు చెవులు కొరుక్కున్నారు. అంతేకాదు హౌస్‌లో వీళ్ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పునర్నవికి కూడా ఈ ప్రశ్న కామన్ అయిపోయింది. అయితే ఈ షో తరువాత బిజీ అయిపోయిన వీరిద్దరూ తమ కెరీర్ పై దృష్టి సారించారు. రాహుల్ కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. అటు సింగర్ గానే కాకుండా అటు నటుడిగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’లో రాహుల్ అవకాశం పట్టేసాడు. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో రాహుల్‌ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. అయితే ఈ సినిమా యూనిట్ నటీనటులకు ఓ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలో రాహుల్‌తోపాటు పునర్నవి కూడా పాల్గొంది.అంతేకాదండోయ్‌ వీరిద్దరూ ఈ సినిమాలోని ఒక పాట పాడుతూ డ్యాన్స్‌ కూడా చేసారు. రాహుల్ కూడా ఇటీవల పునర్నవి పేరెంట్స్ ను కలిసాడు ఆ ఫోటోలను ఇటీవల ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేసాడు. అయితే అప్పట్లో తనను విన్నర్‌గా గెలిచిపించిన అభిమానుల కోసం తాను, పునర్నవి కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తామని అప్పట్లో ప్రకటించిన రాహుల్. ప్రస్తుతం ఆ ఆల్బమ్ పర్మిషన్ గురించి పునర్నవి పేరెంట్స్ ను కలిసినట్టు తెలిపాడు. ఈ ఆల్బమ్ లో పునర్నవి నటించబోతోన్నట్లు తెలుస్తోంది. బేబీ అంటూ సాగే ఒక సాంగ్ కు శాంపిల్ రిథమ్ కంపోసింగ్ కూడా చేసినట్టు తెలుస్తోంది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM