ఆ కుర్రాడి డ్యాన్స్‌ కి హృతిక్ రోషన్ ఫిదా

by సూర్య | Thu, Jan 16, 2020, 02:44 PM

 ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా టిక్ టాక్ వీడియోలే.  టాలెంట్ ఉన్న సామాన్యులని సైతం ఓవర్ నైట్ స్టార్స్ చేస్తుంది . అందులో భాగంగానే ఒక అద్భుతమైన డాన్సర్ కి వేదిక అయ్యింది ఈ టిక్ టాక్ . 'యంగ్ మైఖేల్‌ జాక్సన్' అంటూ నెటిజన్లు కొనియాడుతున్న డ్యాన్సర్‌పై బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ స్పందించారు. ''నేను చూసిన స్మూతెస్ట్ ఎయిర్ వాకర్.. ఎవరీ కుర్రాడు?'' అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. హృతిక్ సోషల్ మీడియాలో చురుకుగానే ఉంటారు. తనకు నచ్చిన అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా ఈ యంగ్ మైఖేల్ చేసిన డ్యాన్స్‌ను చూసిన హృతిక్ రీట్వీట్ చేశారు. అంతేగాక ఎవరీ కుర్రాడు అంటూ అతనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. జోధ్‌పూర్‌కు చెందిన యువరాజ్ సింగ్ మంచి డ్యాన్సర్. బాబాజాక్సన్‌గా టిక్ టాక్‌లో తన డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. మైఖేల్ జాక్సన్ చేసినట్టుగా చాలా సింపుల్‌గా డ్యాన్సులు చేస్తుంటాడు. పాప్ కింగ్‌ను తలపించే ఈ యువకుడి వీడియోను ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. ''వీడియో చివరి వరకు చూడండి.. ఇతన్ని నలుగురికి తెలిసేలా చేయండి'' అంటూ హృతిక్ రోషన్‌ను ట్యాగ్ చేశారు. హృతిక్ స్పందించిన వెంటనే.. అతని వివరాలను నెటిజన్లను ఒక్కొక్కటిగా షేర్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. పలువురు ప్రముఖులు స్పందించారు. బాలీవుడ్ బిగ్ బీ కూడా ఆ కుర్రాడి డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM