పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ‘క్రాక్’ పోస్టర్!

by సూర్య | Tue, Jan 14, 2020, 06:05 PM

డైరెక్ట‌ర్ గోపీచంద్– ర‌వితేజ కాంబినేష‌న్ లో రాబోతున్న ‘క్రాక్’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా యూనిట్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ తో పాటు మెసేజ్ ను కూడా పోస్ట్ చేస్తూ.. ‘మా లాగే మీరు కూడ ఈ పండుగ మీ కుటుంబ సభ్యులతో సరదాగా జరుపుకోండి…మకర సంక్రాంతి శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేశారు. ఇక పోస్టర్ లో రవితేజ లుంగీ అండ్ వైట్ షర్ట్ తో ఆకట్టుకోగా.. శృతిహాసన్ చీర కట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తూ ఆకట్టుకుంది. మొత్తానికి పోస్టర్ ఇంట్రస్ట్ గా ఉంది. కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమాని 2020 సమ్మర్ లో విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM