నన్ను ప్రేమించే వారైతే నిద్రపోనివ్వండి...

by సూర్య | Tue, Jan 14, 2020, 06:24 PM

సంక్రాంతి సరదాలకు సెలెబ్రిటీలు ఏమి మినహాయింపు కాదు. కాగా ఈ సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ అంతా కలిసి జరుపు కుంటున్నారు. ముఖ్యంగా చరణ్, నిహారిక, సాయి ధరమ్, వరుణ్ ఓ చోట చేరి భోగి మంటలు వేసి పండుగ చేసుకున్నారు. ఐతే రామ్ చరణ్ పండుగ రోజు భోగి మంటల కోసం ఉదయాన్నే నన్ను నిద్ర లేపవద్దు అన్నట్లుగా ఓ ఫన్నీ కొటేషన్ ఉన్న టి షర్ట్ ధరించి సరదా చేశారు. ‘మీరు నిజంగా నన్ను ప్రేమించే వారైతే నిద్రపోనివ్వండి..'( ఇఫ్ యు రియల్లీ లవ్ మీ..యు విల్ లెట్ మీ స్లీప్) అనే ఇంగ్లీష్ కొటేషన్ ఉన్న తన టి షర్ట్ ప్రదర్శించారు. చలి కాలంలో పొద్దునే నిద్ర లేవడం కష్టంగా ఉంటుంది అన్నట్లుగా చరణ్ పండుగ రోజు కుటుంబ సభ్యులకు ఈ ఏవిధంగా ఫన్ పంచారు. మెగా ఫ్యామిలీ లోని ధరమ్, అల్లు అర్జున్ తాజా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ సంక్రాంతి వారికి చాలా ప్రత్యేకం అని చెప్పాలి.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM