ప్రభాస్ మూవీ టైటిల్ మార్చనున్నారా?

by సూర్య | Tue, Jan 14, 2020, 05:50 PM

జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో  సాహో మూవీ తర్వాత ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. జాన్ టైటిల్ తో ప్రభాస్ న్యూ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని మార్చబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. శర్వానంద్, సమంత న్యూ మూవీ వల్ల ఆడియన్స్ కన్ ఫ్యూజ్ అయ్యే ఛఆన్స్ ఉందని.. అందుకే ప్రభాస్ జాన్ అనే టైటిల్ మార్చాలని భావిస్తున్నట్టు టాక్.  ఈ కొత్త చిత్రానికి జాన్ టైటిల్ అనుకున్నారు . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ మార్చాలని యూనిట్ ఆలోచన చేస్తున్నట్టు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.శర్వానంద్, సమంత జంటగా దిల్ రాజు నిర్మాణంలో జాను అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ సినిమా తమిళ క్లాసిక్ హిట్ 96కి రిమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ వల్లే ప్రభాస్ జాన్ సినిమా టైటిల్ మార్చాలని యూనిట్ భావిస్తుందట. ప్రభాస్ జాన్, శర్వానంద్ జాను టైటిల్స్ దగ్గరదగ్గరగా ఉండటంతో ఆడియన్స్ కన్ ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే జాన్ టైటిల్ ను మార్చాలని ప్రభాస్ అండ్ టీమ్ ఆలోచిస్తుందట.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM