దూసుకెళ్తోన్న నితిన్ 'భీష్మ' టీజర్!

by సూర్య | Sun, Jan 12, 2020, 04:09 PM

వెంకీ కుడుముల దర్శకత్వంలో  హీరో నితిన్-రష్మిక మందన్నజంటగా తెరకెక్కుతున్న 'భీష్మ' అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. భీష్మ మూవీ టీజర్ వచ్చేసింది. నిమిషానికి పైగా ఉన్న భీష్మ టీజర్ లో నితిన్ ఎనర్జీ అండ్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. భీష్మ చిత్రాన్ని ఫన్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ మూవీ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించినట్టున్నారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2018లో రెండు సినిమాలు చేసిన నితిన్‌, 2019లో సినిమాలేవీ చేయలేదు. దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ముందుగా 'భీష్మ' విడుదల కానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM