మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్న ‘ఫర్హాన్ అక్తర్’

by సూర్య | Sat, Jan 11, 2020, 05:54 PM

మరోసారి  పెళ్లికి  సిద్ధమయ్యాడంట  బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్.  గత  కొంత  కాలంగా ఫర్హాన్‌.. నటి  షీబాని దండేకర్‌తో  ప్రేమలో ఉన్నట్లు బీ-టౌన్‌లో వదంతులు ప్రచారమవుతున్నాయి. సోషల్‌ మీడియాలో  వీరిద్దరూ  కలిసి  ఉన్న  ఫొటోలను  షేర్‌  చేయడంతో  వారి లవ్  గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఫర్హాన్‌, షిబానీలు 2020లో వివాహ బంధంతో ఒక్కటవ్వాలనుకుంటున్నారని.. ఫర్హాన్‌ తాజా చిత్రం  ‘తుఫాన్‌’ విడుదల అనంతరం పెళ్లి చేసుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికీ పెళ్లి తేదీ ఖరారు కాలేదు గానీ.. పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని.. త్వరలోనే తమ బంధాన్ని బహిర్గతం చేయబోతున్నట్లు  తెలిపాయి. కాగా ఫర్హాన్‌.. షీబానీతో కలిసి ఉన్న ఫొటోలను తరచుగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో.. వీరిద్దరూ ఉంగరాలు ధరించి చేతులు పట్టుకొని ఉన్న ఫొటోలను  కూడా ట్వటర్‌లో షేర్‌ చేశారు. అయితే వారి నిశ్చితార్థం విషయంపై స్పష్టతనివ్వనప్పటికీ..వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా ఫర్హాన్‌ అక్తర్‌కు 16 ఏళ్ల కిందట హేర్‌ స్టైలిస్ట్‌ ఆదునా బబానీతో వివాహం జరిగింది. 2016లో విడాకులు తీసుకున్న వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Latest News
 
స్టార్ హీరో కొడుకుతో సుధా కొంగర తదుపరి సినిమా Fri, Apr 26, 2024, 07:21 PM
అమితాబ్ బచ్చన్ మనవడితో రొమాన్స్ చేయనున్న అక్షయ్ కుమార్ మేనకోడలు Fri, Apr 26, 2024, 07:13 PM
'రామం రాఘవం' టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:01 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 06:56 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM