నిన్ను చూసి గర్వపడుతున్నాను: రణ్‌వీర్

by సూర్య | Fri, Jan 10, 2020, 04:44 PM

యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ బయోపిక్ చపాక్ లో నటించడమే కాదు.. ఆ సినిమాని నిర్మించింది కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే. చిన్న చిన్న వివాదాల మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చపాక్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రీమియర్‌ను వీక్షించిన దీపిక భర్త రణ్‌వీర్.. భావోద్వేగానికి గురయ్యాడు. దీపికను, మేఘనను ప్రశంసిస్తూ ఓ భావోద్వేగభరిత లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. `మేఘన.. మీరు తెరకెక్కించిన ఈ చిత్రం జీవితం మీద ఆశను, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఎన్నో విషయాలను అర్థవంతంగా చూపించారు. యాసిడ్ దాడి బాధితులు ఎదుర్కొనే సమస్యలను ప్రతీ ఒక్కరికీ కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ చిత్రం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది.. వెల్‌డన్ మేఘన` అని అభినందించాడు. అలాగే దీపికను ఉద్దేశిస్తూ.. `మై బేబీ.. ఈ సినిమా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు.దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఈ సినిమాకు ఆత్మవి నువ్వే. నీ సినిమాలన్నింటిలోనూ ఈ సినిమాయే గొప్పది. ఎంతో నిజాయితీగా పాత్రలో జీవించావు. నీ పాత్ర నన్నెంతో కదిలించింది. నిన్ను చూసి గర్వపడుతున్నాను. లవ్యూ బేబీ` అంటూ ప్రశంసించాడు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM