’90ఎంఎల్’ మూవీ లేటెస్ట్ అప్ డేట్...

by సూర్య | Mon, Oct 14, 2019, 08:06 PM

హీరో కార్తికేయ డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తోన్న కొత్త చిత్రం ’90ఎంఎల్’. కాగా తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ అంతా పూర్తయిందట. ఇక కేవలం రెండు సాంగ్స్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. కాగా త్వరలోనే ఆ రెండు సాంగ్స్ ను ఫారెన్ లో షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాను నవంబర్ చివరి వారంలో గాని, లేదా డిసెంబర్ మొదటివారంలో గాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘వినింపించుకోరు’ సాంగ్ ప్రోమో ఈ రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ అయింది. సాంగ్ ప్రోమో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. జేబులో ఎప్పుడు లిక్కర్ బాటిల్ మైంటైన్ చేసే డ్రింకర్ లవర్ గా కార్తికేయ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ చిత్ర ట్యాగ్ కూడా ‘యాన్ ఆథరైజ్డ్ డ్రింకర్’ అని ఉండటం కూడా ఆసక్తి రేపుతుంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్నారు. కాగా కార్తికేయ సరసన హీరోయిన్ గా నేహా సోలంకి చేస్తుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ, పోసాని, రావు రమేష్, అజయ్, రవి కిషన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Latest News
 
'భగవంత్ కేసరి' తమిళ వెర్షన్ డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, May 02, 2024, 06:26 PM
దర్శకుడు కృష్ణ చైతన్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీమ్ Thu, May 02, 2024, 06:20 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పుష్ప 2' ఫస్ట్ సింగల్ Thu, May 02, 2024, 06:17 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ లోని స్'టుపిడ్ హార్ట్' లిరికల్ సాంగ్ విడుదలకి తేదీ ఖరారు Thu, May 02, 2024, 06:13 PM
'హరి హర వీర మల్లు' నుంచి తప్పుకున్న దర్శకుడు క్రిష్ Thu, May 02, 2024, 05:58 PM