యూఎస్ కలెక్షన్స్ టాప్-10 లోకి సైరా...!

by సూర్య | Sun, Oct 13, 2019, 04:25 PM

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'సైరా' రిలీజై ఇప్పటికి పది రోజులు దాటింది.  సినిమాకు మంచి రివ్యూస్.. టాక్ వచ్చినా యూఎస్ కలెక్షన్స్ ఆశించినంత లేకపోవడం మొదట్లో ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది.  అయితే 'సైరా' రెండో వారంలో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉండడం శుభపరిణామమే.ఈ శనివారం కలెక్షన్లతో 'సైరా' టోటల్ గ్రాస్ $2.44 మిలియన్ కు చేరింది. దీంతో అమెరికాలో ఆల్ టైం హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ -10 సినిమాల లిస్టులో పదవ స్థానంలో నిలిచింది.  నిజానికి ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గడంతో 'సైరా కలెక్షన్స్ $2.5 మిలియన్ మార్కుకు దగ్గరగా వస్తాయని ఎవరూ అనుకోలేదు. అయితే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరేందుకు మాత్రం ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది. మరో విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం 'ఖైది నెం.150' లైఫ్ టైం కలెక్షన్స్ $2447043 కాగా 'సైరా' ఇప్పుడు ఆ కలెక్షన్స్ ను దాటేసింది.  ఇప్పుడు సైరా కలెక్షన్స్  $2448312.  


అమెరికాలో టాప్-10 కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఫిగర్స్ అన్నీ మిలియన్స్ లో.


బాహుబలి 2: $20.57


బాహుబలి: $6.86


రంగస్థలం: $3.51


భరత్ అనే నేను: $3.41


సాహో: $3.23


శ్రీమంతుడు: $2.88


మహానటి: $2.54


గీతగోవిందం: $2.46


అ ఆ: $2.44


సైరా: $2.44

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM