ఆయనతో మరోసారి జోడీ కట్టాలని వుంది: తమన్నా

by సూర్య | Sat, Oct 12, 2019, 02:22 PM

'సైరా' చిత్రంలో తమన్నా ఒక ముఖ్యమైన పాత్రను పోషించి అందరిచే ప్రశంశలు పొందింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో .. తన పాత్రకి మంచి పేరు రావడంతో ఆమె ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తమన్నా తమిళంలో చేసిన 'పెట్రోమ్యాక్స్' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది.


తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ఉండగా హీరో విజయ్ ప్రస్తావన వచ్చింది. అప్పుడామె స్పందిస్తూ .. "చాలా కాలం క్రితం విజయ్ తో కలిసి 'సుర' సినిమాలో నటించాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా చిన్నది. పాటల షూటింగు సమయంలోను సెట్ కి వచ్చేసి డాన్సులు చేసేసి వెళ్లిపోయేదానిని. అప్పటికే విజయ్ పెద్ద స్టార్ కావడం వలన ఎక్కువగా మాట్లాడేదానిని కాదు. ఆయనతో మరోసారి జోడీ కట్టాలని వుంది. అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM