బిగ్ బాస్ చిత్రం గీసి వివరణ ఇచ్చిన కంటెస్టంట్స్

by సూర్య | Sat, Oct 12, 2019, 12:25 PM

బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకుంది. సాధారణంగా.. బిగ్ బాస్ పిచ్చి పిచ్చి టాస్క్ లు ఇస్తే...వాటిని చేసి కంటెస్టంట్స్ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తున్నారు. శుక్రవారం ఎపిసోడ్లో ఈ పిచ్చి పీక్స్ కు వెళ్లిపోయింది. మొదట బిగ్ బాస్ పడుకుంటే ఎవరి డిస్ట్రబ్ చేయకూడదని చెప్పి...కంటెస్టంట్స్ కు డిస్ట్రబ్ చేసే సరదా టాస్క్ లు ఇచ్చారు. ఆ టాస్క్ లతో కంటెస్టంట్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.  తర్వాత తాను ఎలా ఉంటానో బొమ్మ గీసి వివరించాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ ఆర్డర్ వేశారు. దీంతో ప్రతి కంటెస్టంట్ ఓ రవివర్మ పికాసోలు లాగా ఫీల్ అయిపోయి బిగ్ బాస్ బొమ్మ గీసేశారు.


ఒక్కొక్కరు ఒక్కో రూపాన్ని ఊహించుకుని బిగ్ బాస్ బొమ్మ వేశారు. అలీ దృష్టిలో బిగ్ బాస్ అంటే ఓ రాజు అని చెప్పగా - బాబా భాస్కర్ ఓ బ్రెయిన్ అని చెప్పాడు. వరుణ్ ఏమో హిమాలయాల్లో ఉండే ఒక బాబా అని చెబితే...వితికా ఓ డాన్ బొమ్మ గీసింది. రాహుల్ ఏమో ‘మై లైఫ్ మై రూల్స్’అనే వ్యక్తి బిగ్ బాస్ అని చెప్పాడు. శ్రీముఖి ఏమో ఎంటర్టైన్మెంట్ కింగ్ అని చెప్పింది. ఇక శివజ్యోతి ఏమో అనుబంధాలు - అనురాగాలు అంటూ ఏదో పిచ్చి బొమ్మ గీసేసింది.


వీరందరూ ఒక ఎత్తు అయితే మహేష్ ఒక ఎత్తు అయ్యాడు. బిగ్ బాస్ అంటే దేవుడు అని దేవుడుకు రూపం ఉండదు కదా అలాగే బిగ్  బాస్ కూడా అని చెప్పి పెద్ద పెద్ద బిస్కెట్లు వేశాడు. మరి దీనికే బిగ్ బాసు ములగచెట్టు ఎక్కేసి ఉంటాడు. ఇక ఈ పిచ్చి బొమ్మల టాస్క్ అయిపోయాక బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు శుక్రవారం కూడా కొనసాగాయి. గురువారం ఎపిసోడ్లో ఎలాగో కేకులు పెట్టి ఇంటి సభ్యులని చంపేశారు. అయితే కేకులు గోల శుక్రవారం కూడా కొనసాగింది.


బిగ్ బాస్ కేకుల మీద కేకులు పంపి వాటిని తినాలని ఇంటి సభ్యుల పొట్ట పగిలేలా చేశారు. వారు మాకొద్దురా బాబు అన్న కేకులు వస్తూనే ఉన్నాయి. తర్వాత బిగ్ బాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ భాగంగా రాహుల్ ఓ మంచి పాట పాడగా ఆ పాటకు తగిన విధంగా  ఇంటి సభ్యులందరూ డ్యాన్స్ చేశారు. బాబా ఆ పాట వీడియో తీసి అద్భుతంగా చిత్రీకరించారు.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM