స్వాతంత్ర సంబరాలను ఘనంగా జరపాలి

by సూర్య | Sat, Aug 06, 2022, 02:22 PM

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం చారిత్రాత్మక సందర్భం కాబట్టి ప్రతి ఒక్కరు వజ్రోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకోవాలని న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం సాధించడం కోసం అనేక మంది త్యాగదనులు తమ ధన , ప్రాణాలను పణంగా పెట్టారని అన్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటాలని యనమల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, శిరీష, రాఘవరావు, రేలంగి బాపిరాజు, రాజా స్థానికులు పాల్గొన్నారు.

Latest News

 
ఈ నెల 23న వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం లబ్దిదారులకు నగదు జమ Fri, Aug 19, 2022, 09:40 PM
క్షణికావేశంలో తీసుకున్న ఆ నిర్ణయం...విషాధంగా మారింది Fri, Aug 19, 2022, 09:39 PM
ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలూ లేదు: కె.విజయానంద్‌ Fri, Aug 19, 2022, 09:38 PM
నార్కో టెస్ట్ ను ఎదుర్కొనే దమ్ముందా...నారా లోకేష్ కు విజయసాయిరెడ్డి సవాల్ Fri, Aug 19, 2022, 09:37 PM
‘పవన్ మాల’ పేరిట దీక్ష..వినూత్నంగా వ్యవహరిస్తున్న పవన్ అభిమానులు Fri, Aug 19, 2022, 09:36 PM