పేద ప్రజల ఇళ్లను కూల్చవద్దు

by సూర్య | Sat, Aug 06, 2022, 02:25 PM

నెల్లూరు నగరంలోని మైపాడు రోడ్డులో ఇళ్లను దౌర్జన్యంగా తొలగించే చర్యలను తక్షణమే ఆపాలని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీపీఎం ఆధ్వర్యాన బాధితులు మైపాడు గేట్‌ సెంటర్‌ నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసం నిబంధనలకు వ్యతిరేకంగా ఇళ్లను కూల్చటం సరికాదన్నారు. పునరావాసం, నష్ట పరిహారం చెల్లించకుండా 300పైగా బుల్డోజర్లతో కూల్చి వేయటం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్లకు పైగా మైపాడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న జాఫర్‌ సాహెబ్‌ కాలువకట్ట ప్రాంతం, శ్రీనివాసనగర్‌ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు ఎలాంటి నోటుసులు ఇవ్వకుండా తొలగించారన్నారు.

Latest News

 
ఈ నెల 23న వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం లబ్దిదారులకు నగదు జమ Fri, Aug 19, 2022, 09:40 PM
క్షణికావేశంలో తీసుకున్న ఆ నిర్ణయం...విషాధంగా మారింది Fri, Aug 19, 2022, 09:39 PM
ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలూ లేదు: కె.విజయానంద్‌ Fri, Aug 19, 2022, 09:38 PM
నార్కో టెస్ట్ ను ఎదుర్కొనే దమ్ముందా...నారా లోకేష్ కు విజయసాయిరెడ్డి సవాల్ Fri, Aug 19, 2022, 09:37 PM
‘పవన్ మాల’ పేరిట దీక్ష..వినూత్నంగా వ్యవహరిస్తున్న పవన్ అభిమానులు Fri, Aug 19, 2022, 09:36 PM