చీటీల పేరుతో మహిళ మోసం

by సూర్య | Sat, Aug 06, 2022, 02:17 PM

చీటీల పేరుతో పలువుర్ని నమ్మించి ఓ మహిళ రూ. 28 లక్షలతో ఊడాయించింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పరవాడ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు తెలిపిన వివరాలివి. పార్వతీపురం ప్రాంతానికి చెందిన కసిరెడ్డి ఉమ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవీఎంసీ 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెం శివారు సాయినగర్‌ కాలనీలో పదిహేనేళ్లుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. గత ఐదేళ్లగా వరలక్ష్మీదేవి పేరుతో చీటీలు కట్టించుకునేది.


నెలకు రూ. 500, రూ. 1000, రూ. 2000 చొప్పున పలువురి నుంచి కట్టించుకొని వరలక్ష్మీదేవి వ్రతానికి ముందు అందరికీ వడ్డీతో సహా నగదు చెల్లించేది. దీంతో ఆమెపై స్థానికులకు నమ్మకం కుదిరింది. ఈ ఏడాది కూడా అదే విధంగా పలువురు చీటీలు కట్టారు. వరలక్ష్మీదేవి వత్రం సమీపిస్తున్నా నగదు ఇవ్వకపోవడంతో పలువురు మహిళలు ఆమె ఇంటికి వెళ్లి నిలదీశారు. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు గొడవ పడ్డారు. సుమారు రూ. 28 లక్షల వరకు చీటీల సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఇదిలావుంటే, ఉమ గురువారం సాయంత్రం ఇంటికి తాళాలు వేసి ఉడాయించింది. ఈ విషయాన్ని గుర్తించిన బాధితులు ఆమెకు ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయామని గ్రహించి గురువారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు అప్పల బత్తుల కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి


ఉమ వద్ద చీటీలు కట్టి మోసపోయిన వారుంటే వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సీఐ ఈశ్వరరావు సూచించారు. గుర్తింపు లేని సంస్థలు, వ్యక్తుల వద్ద చీటీలు కట్టి మోసపోవద్దన్నారు. ఇప్పటి వరకు ఉమ రూ. 28 లక్షల మేర మోసం చేసినట్టు తమకు ఫిర్యాదులు అందాయన్నారు.

Latest News

 
ఈ నెల 23న వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం లబ్దిదారులకు నగదు జమ Fri, Aug 19, 2022, 09:40 PM
క్షణికావేశంలో తీసుకున్న ఆ నిర్ణయం...విషాధంగా మారింది Fri, Aug 19, 2022, 09:39 PM
ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలూ లేదు: కె.విజయానంద్‌ Fri, Aug 19, 2022, 09:38 PM
నార్కో టెస్ట్ ను ఎదుర్కొనే దమ్ముందా...నారా లోకేష్ కు విజయసాయిరెడ్డి సవాల్ Fri, Aug 19, 2022, 09:37 PM
‘పవన్ మాల’ పేరిట దీక్ష..వినూత్నంగా వ్యవహరిస్తున్న పవన్ అభిమానులు Fri, Aug 19, 2022, 09:36 PM