కోడలిని పట్టించిన...పోస్ట్‌మార్టం రిపోర్టు

by సూర్య | Sat, Aug 06, 2022, 03:31 AM

నేరం ఎంతదాచినా దాగదు. ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. తాజాగా కృష్ణా జిల్లాలో సంచలనంరేపిన మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. అత్తను కోడలు హత్యచేసి ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ చిన్న ఆధారంతో పోలీసులకు దొరికిపోయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. పెడన కృష్ణాపురానికి చెందిన వీరబాబుతో కొండాలమ్మకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ అత్త, కోడళ్ల మధ్య తరచూ గొడవలు జరిగాయి. అత్త రజనీపై కోడలు కొండాలమ్మ కక్ష పెంచుకున్నారు. అత్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది.


గత నెల 27న రజనీని కర్రతో తలపై కొట్టింది.. ఆమె పీక పిసికి చంపేందుకు ప్రయత్నించింది. ఆమె అప్పటికీ చనిపోకపోవడంతో చీరను మెడకు బిగించింది. నోరు, ముక్కు నుంచి రక్తం రావడంతో అత్త స్పృహ కోల్పోయింది. వెంటనే తన భర్తకు, బంధువులకు ఫోన్ చేసి చనిపోయినట్లు సమాచారం ఇచ్చింది. హత్యను కవర్ చేసేందుకు.. అత్త కాలుజారి వరండాలో పడిపోయిందని కట్టు కథ అల్లింది. భర్త, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఇంటికి వచ్చిన కుమారుడు, కూతురు తీవ్ర గాయాలతో ఉన్న తల్లిని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


రజనీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 30న ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు వీరబాబు తన తల్లి ఇంట్లో ప్రమాదవశాత్తు పడటంతో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆమెకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు.


విజయవాడ డాక్టర్లు ఇచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్టుతో కోడలు కొండాలమ్మ అడ్డంగా దొరికిపోయింది. మృతురాలి తలకు బలమైన దెబ్బ తగలడం.. ఆపై ఊపిరి ఆడక చనిపోయినట్లు రిపోర్టులో ప్రస్తావించారు. పోలీసులకు అనుమానం వచ్చింది.. కోడలు కొండాలమ్మను ప్రశ్నించారు. ఆమె తానే అత్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. అత్తను చంపడానికి ఉపయోగించిన చీరను వారు సీజ్ చేశారు. ఈ కేసును హత్య కేసుగా మార్చి.. నిందితురాలు కొండాలమ్మను అరెస్ట్ చేశారు. అత్తను చంపి డ్రామాలాడిన ఆమె జైలుపాలయ్యారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM