వెంకటపతి రాజాను అభినందించిన జనసేన పార్టీ

by సూర్య | Sat, Aug 06, 2022, 03:30 AM

చమురు, సహజ వాయువుల సంస్థలైన గెయిల్‌, ఓఎన్జీసీ సంస్థలపై గత రెండేళ్లుగా న్యాయ పోరాటం చేసి గెలిచిన రాజోలు నియోజకవర్గంకు చెందిన జనసైనికుడు వెంకటపతి రాజాను జనసేన పార్టీ అభినందించింది. ఆయన కృషి అభినందనీయమని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు అన్నారు.


కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్జీసీ) కారణంగా భావించి రూ. 22.72.61.000 జరిమానా విధిస్తూ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. గెయిల్‌, ఓఎన్జీసీ సంస్థల కారణంగా, కోనసీమలో జరుగుతున్న అన్వేషణల ఫలితంగా జల కాలుష్యం ఏర్పడుతోందని వెంకటపతి రాజా 2020లో ఆధారాలతో సహా "నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారట.


పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడ్డ గెయిల్‌, ఓఎన్జీసీ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్జీటీ ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. ఓఎన్జీసీకి రూ.22.72 కోట్ణ రూపాయల జరిమానా విధించింది. జనసేన సిద్ధాంతాలలోని ప్రధానమైన పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడి గెలిచిన వెంకటపతి రాజా జనసేన శ్రేణులకు ఆదర్శంగా నిలిచారని నాగబాబు అభినందించారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM