ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకొన్న ఎన్వీ రమణ

by సూర్య | Fri, Aug 05, 2022, 11:11 PM

ఉస్మానియా యూనివర్శిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ ను భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ‌ అందుకొన్నారు. ఇటీవల ఎన్వీ రమణకు తెలంగాణ‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం గౌర‌వ డాక్ట‌రేట్‌ను ప్ర‌క‌టించింది. ఓయూ డాక్ట‌రేట్‌ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ శుక్ర‌వారం వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోని ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటైన 82వ స్నాత‌కోత్స‌వంలో భాగంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు అంద‌జేశారు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఈ నెల‌లోనే ఆ ప‌ద‌వి నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ పొంద‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఓయూ గౌర‌వ డాక్ట‌రేట్‌ను ప్ర‌దానం చేసింది.

Latest News

 
మార్స్ ఆర్బిటర్ మిషన్ 'మామ్' పనితీరు నిలిచిపోయిందా...కారణాలను అన్వేషిస్తున్న ఇస్రో Sun, Oct 02, 2022, 08:25 PM
గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం Sun, Oct 02, 2022, 06:49 PM
చిన్నారిని చూసి చలించిన సీఎం.. వైద్యానికి రూ.1కోటి మంజూరు Sun, Oct 02, 2022, 06:48 PM
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ Sun, Oct 02, 2022, 06:47 PM
ఎల్లో మీడియా చేసేది జర్నలిజమేనా-- మంత్రి మేరుగు నాగార్జున Sun, Oct 02, 2022, 06:46 PM