వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్...ప్రత్యేకతలు ఇవే

by సూర్య | Fri, Aug 05, 2022, 11:10 PM

మర్కెట్ లోకి కొత్త కొత్త ఫ్యూచర్లతో స్మార్ట్ ఫోన్ల రాక మొదలైంది. దీంతో ఏ ఫోన్ ఫ్యూచర్ ఏమిటీ అన్న చర్చ సహజంగానే వినియోగదార్లలో మొదలైంది. తాజగా మధ్యశ్రేణి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వివో సంస్థ తయారు చేసిన వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ప్రత్యేకతలు లీకయ్యాయి. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్, ఐఎంఈఐ నంబరింగ్ కోసం అప్లై చేసిన వివరాల ఆధారంగా వివో వీ25, వీ25 ప్రో ఫోన్లకు సంబంధించిన ప్రత్యేకతలను ప్రఖ్యాత మొబైల్ టెక్ వెబ్ సైట్లు బహిర్గతం చేశాయి. ఆగస్టు 17వ తేదీన దీనిని అధికారికంగా ప్రకటించనున్నారని.. 25వ తేదీ నుంచి విక్రయాలు మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి.


ఫోన్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.


వివో వీ 25 ప్రో ఫోన్ లో మీడియా టెక్ డైమన్సిటీ 1300 ప్రాసెసర్, మాలి జీ77 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటాయి. 8 జీబీ నుంచి 12 జీబీ వరకు ర్యామ్ తో మోడళ్లు అందుబాటులో ఉంటాయి. వివో వీ25 సాధారణ మోడల్ లో మీడియా టెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్, మాలి జీ68 ప్రాసెసర్ ఉంటాయని టెక్ వెబ్ సైట్లు పేర్కొన్నాయి. ఫోన్ ఆరున్నర అంగుళాల పరిమాణంలో ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టం లోడ్ అయి రానుంది. డిస్ ప్లే పైభాగంలో మధ్యన పంచ్ హోల్ విధానంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని టెక్ వెబ్ సైట్లు తెలిపాయి. ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని పేర్కొన్నాయి. అయితే వెనుక మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఉంటుందని.. దీనివల్ల చేతులు కాస్త కదులుతూ ఫొటో తీసినా, బ్లర్ కాకుండా స్పష్టమైన ఫొటోలు తీసే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఈ ఫోన్ ధర ఎంత వరకు ఉండవచ్చన్న దానిపై ఎలాంటి అంచనాలూ వెలువడలేదు. మధ్య స్థాయి బడ్జెట్ కు అందుబాటులో ఈ ఫోన్ ఉంటుందని మాత్రం టెక్ వెబ్ సైట్లు అంచనా వేశాయి. 

Latest News

 
వింత ఘటన.. గాల్లోనే ఆగిపోయిన షటిల్ కాక్ Thu, Dec 08, 2022, 11:36 AM
రేపు కోటప్పకొండ లో ఆరుద్రోత్సవం Thu, Dec 08, 2022, 11:30 AM
మరో ఉద్యమానికి సిద్ధం: మాజీ ఉపసభాపతి Thu, Dec 08, 2022, 11:29 AM
ఆర్ధిక ప్రగతిలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్‌ Thu, Dec 08, 2022, 11:25 AM
ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సవం వేడుకలు Thu, Dec 08, 2022, 11:24 AM