కాంగ్రెస్ కూడా త్రివర్ణ పతాకంతో వచ్చేసింది...కానీ బీజేపీకి బిన్నంగా

by సూర్య | Fri, Aug 05, 2022, 11:09 PM

సిద్దాంతాల పరంగా వైరుద్యమున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏ కార్యక్రమం చేసిన పరస్పర విరుద్దంగా  ఇరు పార్టీల కార్యక్రమాలు ఉంటాయి. ఇదిలావుంటే తాజాగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేప‌థ్యంలో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరిట భారీ కార్య‌క్ర‌మానికి తెర తీసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ నేత‌లంద‌రికి సోష‌ల్ మీడియా ప్రొఫైల్ పిక్‌లు త్రివ‌ర్ణ ప‌త‌కాంతో మారిపోయాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా ఆ పార్టీ కీల‌క నేత‌ల‌తో పాటు కింది స్థాయి నేత‌ల ప్రొఫైల్ పిక్‌లు ఇప్ప‌టికే మారిపోయాయి.


ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్ర‌త్యేక సంద‌ర్భానికి గుర్తింపుగా త‌మ సోష‌ల్ మీడియా ప్రొఫైల్ పిక్‌లను మార్చేస్తోంది. బీజేపీ నేత‌ల‌కు కాస్తంత భిన్నంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ... భార‌త తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని చేతుల్లో ప‌ట్టుకున్న చిత్రాన్ని త‌న ప్రొఫైల్ పిక్‌గా ఎంచుకుంది. బుధ‌వారం ఆ పార్టీ అగ్ర నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు త‌మ ఖాతాల‌కు నూత‌న ప్రొఫైల్ పిక్‌ల‌ను జ‌త చేశారు. పార్టీలోని కీల‌క నేత‌లంతా ఇదే ప్రొఫైల్ పిక్‌ల‌ను త‌మ డీపీలుగా మార్చుకుంటున్నారు.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM