'వైసీపీ డర్టీ పిక్చర్' పేరుతో బుద్దావెంకన్న ట్విట్ లు

by సూర్య | Fri, Aug 05, 2022, 11:11 PM

వైసీపీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'వైసీపీ డర్టీ పిక్చర్' అంటూ ట్విట్ చేశారు. ఇదిలావుంటే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్టు ఎంపీ మాధవ్ ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. ఈ వ్యవహారంలో సభ్యతకు సంబంధించిన అన్ని హద్దులను వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాటేశారని బుద్ధా వెంకన్న విమర్శించారు. మర్మాంగాలను అసభ్యకరరీతిలో ప్రదర్శించడం, ఓ మహిళ ఎదుట బయటపెట్టే ప్రయత్నం చేయడం హేయమైన నేరం అని స్పష్టం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఓ పార్లమెంటు సభ్యుడు, గౌరవప్రదమైన పదవిలో ఉన్నవాడు కావడం మరింత దారుణమని వివరించారు. 


వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై గతంలో అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయని బుద్ధా వెంకన్న  వెల్లడించారు. ఇప్పుడో వీడియోలో హస్తప్రయోగం చేసుకుంటూ దొరికిపోయాడని తెలిపారు. అతడికి లైంగిక అరాచకాలకు సంబంధించిన చరిత్ర ఉందని, అయినప్పటికీ అతడికి జగన్ టికెట్ ఇచ్చారని, ఇప్పటికీ ప్రోత్సహం అందిస్తూనే ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు 'వైసీపీ డర్టీ పిక్చర్' పేరిట బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM