కన్నుల పండుగగా సీతారాముల నిత్య కళ్యాణం

by సూర్య | Thu, Jun 23, 2022, 12:42 PM

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం రామయ్యకు కన్నులపండుగగా నిత్య కళ్యాణం నిర్వహించారు. ఆలయ తలుపులు తెరిచి, స్వామి వారికి సుప్రభాతసేవ జరిపారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నివేదన, నిత్య హోమాలు, నిత్య బలిహరణం నిర్వహించారు. అలాగే రామాలయం గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం, గంధ సింధూరం, తమలపాకులతో ప్రత్యేక పూజలు జరిపారు. తదుపరి స్వామి వారి కళ్యాణమూర్తులను  మండపంలో వేంచేపు చేసి సంప్రదాయ బద్ధంగా నిత్యకల్యాణం నిర్వహించారు నిత్యకళ్యాణంలో పాల్గొన్న దాతలకు స్వామివారి ప్రసాదాలను, శేష వస్త్రాలను అందజేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM