శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత ఆలయం మహాసంప్రోక్షణ క్రతువు

by సూర్య | Thu, Jun 23, 2022, 12:43 PM

సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటనకు బయల్దేరారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయానికి సీఎం వైయ‌స్ జగన్‌ బయలుదేరారు. శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత ఆలయం మహాసంప్రోక్షణ క్రతువులో పాల్గొనేందుకు గురువారం తిరుపతి జిల్లాకు వస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.  ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతున్న తిరుపతి జిల్లా పారిశ్రామిక కాంతులతో విరాజిల్లనుంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత ఆలయం మహాసంప్రోక్షణ క్రతువులో పాల్గొనేందుకు గురువారం తిరుపతి జిల్లాకు వస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తిరుపతి సమీపంలోని పేరూరు కొండపై 900 ఏళ్ల చరిత్ర కలిగిన వకుళమాత ఆలయం ఉంది. సుమారు 350 ఏళ్ల క్రితం మహమ్మదీయుల దండయాత్రల్లో దెబ్బతిన్న ఆలయం ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ చూపి దీన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకొచ్చి టీటీడీని ఒప్పించి జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రభుత్వపరంగా సీఎం పూర్తి సహకారం అందించారు. ఆలయానికి 83.41ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి టీటీడీకి అప్పగించారు. వకుళమాత ఆలయాన్ని స్వర్ణమయం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సంకల్పించి 42 కిలోల బంగారంతో ఆర్నెల్లలోనే ఆలయ గోపురాన్ని స్వర్ణమయం చేశారు. సొంత నిధులతో అమ్మవారికి బంగారు అభరణాలు, కనకపు కవచాలను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చేయించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా బంగారు ఆభరణాలను టీటీడీకి అందించనున్నారు. 

Latest News

 
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM
మిస్‌ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి Tue, Jul 05, 2022, 11:47 AM
నా వెనుక ఉన్నదీ ఆయనే Tue, Jul 05, 2022, 11:46 AM
కర్నూల్ కి చేరుకున్న సీఎం జగన్ Tue, Jul 05, 2022, 11:39 AM
ఏపీలో నేటి వాతావరణ సమాచారం Tue, Jul 05, 2022, 11:38 AM