10 వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు శుభవార్త

by సూర్య | Thu, Jun 23, 2022, 12:11 PM

అనంతపురం పోలీస్ లైబ్రరీ కమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టడీ సెంటర్ నుండి 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జిల్లా పోలీసుశాఖ ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు.  ఈ నెల 23 నుండి 27 వ తేదీ వరకు మంచి అనుభవం కల్గి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఆన్లైన్ క్లాసులు ప్రారంభించబోతున్నారు.  జిల్లా పోలీసుశాఖకు సంబంధించిన యూ ట్యూబ్ ఛానల్ లింక్ https://youtube.com/channel/UCmFdRJf88CBIBkrEuduf_JW


ద్వారా ఆన్లైన్ తరగతులు చూడవచ్చు/వినవచ్చు . 10 వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS విజ్ఞప్తి చేసారు. 


ఆన్లైన్ తరగతుల షెడ్యూల్...ఈనెల 23 న... మధ్యహ్నాం 4:30 నుండీ 5:30 గంటలకు మ్యాప్స్ సబ్జెక్టుపై ఓబుళేసు (Y రాంపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు), ఆనంద్ ప్రసాద్  ( కనకూరు జడ్పీ ఉన్నత పాఠశాల) , ఇదే రోజు....5:30 నుండి 6:30 గంటలకు బయాలజీ సబ్జెక్టుపై మేడా ప్రసాద్ (హనకనహాళ్ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు) ,  ఈనెల 24 న...సాయంత్రం 4:30 నుండీ 5:30 గంటలకు మ్యాడ్స్ సబ్జెక్టుపై ఓబుళేసు ఆనంద్ ప్రసాద్ , ఇదే రోజు... సాయంత్రం 5:30 నుండీ 6:30 గంటలకు బయాలజీ సబ్జెక్టుపై మేడా ప్రసాద్,  సాయంత్రం 6:30 నుండి 7:30 గంటలకు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుపై కె.వి రమణ( రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ స్కూల్ టీచర్) ,  ఈనెల 25 న...సాయంత్రం 4:30 నుండీ 5:30 గంటలకు మ్యాప్స్ సబ్జెక్టుపై ఓబుళేసు ఆనంద్ ప్రసాద్,  ఇదే రోజు... సాయంత్రం 5:30 నుండీ 6:30 గంటలకు బయాలజీ సబ్జెక్టుపై మేడా ప్రసాద్, సాయంత్రం 6:30 నుండి 7:30 గంటలకు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుపై కె.వి రమణ, ఈ నెల 26 న...సాయంత్రం 4:30 నుండీ 5:30 గంటలకు మ్యా ప్స్ సబ్జెక్టుపై ఓబుళేసు ఆనంద్ ప్రసాద్, ఇదే రోజు... సాయంత్రం 5:30 నుండీ 6:30 గంటలకు బయాలజీ సబ్జెక్టుపై మేడా ప్రసాద్, సాయంత్రం 6:30 నుండీ 7:30 గంటలకు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుపై కె.వి రమణ , ఈ నెల 27 న...సాయంత్రం 4:30 నుండి 5:30 గంటలకు మ్యాప్స్ సబ్జెక్టుపై ఓబుళేసు ఆనంద్ ప్రసాద్ ,  ఇదే రోజు... సాయంత్రం 5:30 నుండీ 6:30 గంటలకు బయాలజీ సబ్జెక్టుపై మేడా ప్రసాద్ ,  సాయంత్రం 6:30 నుండి 7:30 గంటలకు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుపై కె.వి రమణలు క్లాస్ చెప్పనున్నారు. 

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM