పోడువైన చెవులు ఆ మేకను సెలబ్రేటీగా మార్చేసింది...ఇపుడు గిన్నిస్ రికార్డలోకి

by సూర్య | Wed, Jun 22, 2022, 02:21 PM

మనలోని కొన్ని ప్రత్యేకతలో మనల్ని సెలబ్రేటీలుగా మార్చేస్తుంది. తాజాగా పాకిస్తాన్ లోని ఓ మేక పిల్లకు అదే స్టాటస్ వచ్చింది. పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించిన ఒక మేక పిల్ల గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతోంది. ఈ మేక పిల్లకు 19 ఇంచులు (46 సెంటీమీటర్లు) పొడవైన చెవులు ఉండటమే దీనికి కారణం. జూన్ 5న ఈ మేక పిల్ల జన్మించింది. మేక పిల్ల యజమాని ముహమ్మద్ హాసన్ దీనికి సింబా అనే పేరు పెట్టాడు. ఈ మేక పిల్ల పుట్టిన తర్వాత దీన్ని చూసిన వారందరూ నోరెళ్లబెట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో దీని చెవులు ఉన్నాయి. అది నడుస్తుంటే దాని చెవులు నేలను తాకుతున్నాయి. దీంతో దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. రాత్రికి రాత్రే ఇది పాకిస్థాన్ లో ఒక సెలబ్రిటీ అయిపోయింది. జన్యుపరమైన తేడాల వల్లే మేక పిల్ల చెవులు అంత పొడవుగా ఉండొచ్చని నిపుణులు చెపుతున్నారు. ఏదేమైనప్పటికీ పొడవైన చెవులతో ఈ మేక పిల్ల ఎంతో అందంగా, ప్రత్యేకమైన ఆకర్షణతో కనపడుతోంది. ఇప్పుడు గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కబోతోంది.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM