ఉక్రెయిన్ బాలుల కోసం చలించిన రష్యన్

by సూర్య | Wed, Jun 22, 2022, 02:20 PM

మానవత్వం ఎక్కడైనా పరిమళిస్తుంది. అది తన, మాన, ప్రాంతం, కులం, మతం చూడదు. అలాంటి మానవత్వం పరిమళించే ఓ ఘటన ఇది. ఉక్రెయిన్ ల కోసం ఓ రష్యన్ మానవత్వం చాటాడు. ఇది వినేందుకు కాస్త ఆశ్చర్యం కలిగినా ఇది మాత్రం వాస్తవం. రష్యన్ పత్రిక నొవయా గెజెటా ఎడిటర్ ఇన్ చీఫ్ దిమిత్రి మురతోవ్ నోబెల్ బహుమతి విజేత. ఆయనకు 2021లో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. సొంతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్ ఇచ్చారు. అయితే, గత కొన్నినెలలుగా రష్యా జరుపుతున్న దాడుల్లో వందలాది మంది ఉక్రెయిన్ చిన్నారులు శరణార్థులుగా మారి పొరుగుదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఆ చిన్నారుల పరిస్థితి పట్ల నోబెల్ విజేత దిమిత్రి మురతోవ్ చలించిపోయారు. ఆ బాలలకు సాయం చేసేందుకు గాను, తన నోబెల్ బహుమతిని వేలం వేసేందుకు ఇచ్చేశారు. 


ఇప్పుడా నోబెల్ పీస్ ప్రైజ్ కు వేలంలో రూ.807 కోట్ల ధర పలికింది. అమెరికా సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ ఈ నోబెల్ శాంతి బహుమతిని వేలం వేసింది. ఈ నోబెల్ అవార్డును వేలంలో దక్కించుకుంది ఎవరో మాత్రం హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ వెల్లడించలేదు. వచ్చిన నిధులను ఉక్రెయిన్ బాల శరణార్థుల కోసం వినియోగించనున్నారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM