అలెర్ట్..రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదు

by సూర్య | Sat, May 21, 2022, 04:01 PM

దేశంలో నేడు రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ4వైరస్‌ తొలి కేసు తెలంగాణలో నమోదైంది. అలాగే రెండో కేసు తమిళనాడులో గుర్తించడం జరిగింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలోని చెంగల్పట్టు జిల్లాలోని నవలూర్ లో నివశిస్తున్నట్లుగా గుర్తించినట్లు తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ వెల్లడించారు.


తెలంగాణలో చూస్తే వైరస్ సోకిన వ్యక్తి హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి కాదని నిర్దారణ అయ్యింది. కేవలం మూడ్రోజుల పాటు ఐఎస్‌బీలో గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు ఆ వ్యక్తి వచ్చినట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM