చురుగ్గా నైరుతి రుతుపవనాలు ...తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

by సూర్య | Sat, May 21, 2022, 03:08 PM

మే మాసంలోనే తెలుగు రాష్ట్రాలు  చల్లబడ్డాయి. వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.


ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. మరో వారం లోపే కేరళను తాకే అవకాశం ఉందని.. ఈ సారి ముందుగానే రుతుపవనాలు రానున్నాయి. జూన్ 5 నుంచి జూన్ 10వ తేదీలోపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM