శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో విశేష పూజలు

by సూర్య | Sat, May 21, 2022, 01:58 PM

వూసావాని పేట గ్రామంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈనెల 25వ తేదీ బుధవారం నుండి 29వ తేదీ ఆదివారం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు మావుడూరి సత్యనారాయణ శర్మ, శ్రీనివాస శర్మ సూర్యప్రకాశ్ శర్మ ఒక ప్రకటనలో శనివారం తెలియజేశారు. హనుమజ్జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి రోజు ఎనిమిది గంటల నుండి రామాయణ, భారత, భాగవత పారాయణం, సూర్యనమస్కారములు, భక్తుల ఈతి బాధల నివారణకు మృత్యన్ జయ, నవగ్రహ జప హోమములు, వేదవిదులైన పండితులచే చేయబడతాయి అని వారు తెలిపారు. ఉదయం 10 గంటలు నుండి తమల అర్చన, సింధురార్చన భక్తుల స్వహస్తముల తో జరిపించబడునని తెలిపారు. సాయంత్రం స్వస్తి, నీరాజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఆంజనేయస్వామికి తమలపాకుల పూజ చేయడం వలన ఆయువు, ఆరోగ్యం వృద్ధి చెంది అప్పుల బాధలు కుటుంబ బాధలు తొలగి సుఖ సంతోషాలతో కుటుంబాలు ఉంటాయని పురాణాల్లో పరాశరుడు చెప్పినట్లు వారు తెలిపారు. 27వ తేదీ శుక్రవారం నాలుగు గంటల నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మరియు మహాలింగార్చన రుద్రాభిషేక పూజలు జరుపబడును అని తెలిపారు. అదేవిధంగా 28వ తేదీ సాయంత్రం 6: 00 నుండి సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారు మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది అని తెలిపారు. 29వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి మహా అన్నప్రసాద వితరణ దేవాలయ ప్రాంగణంలో జరిపించబడునని తెలియజేశారు. పై పూజా కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న భక్తులు ముందుగా ఆలయం వద్ద పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. భక్తులు యావన్మంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని దేవాలయ నిర్వాహకులు మరియు ప్రధానార్చకులు మావుడూరి

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఇదేం పైత్యం.. ఏ పార్టీకి ఓటేశారో చెబుతూ వీడియోలు, ఫోటో తీసుకున్నారు Tue, May 14, 2024, 09:23 PM
ఏపీలో ఓటు వేసేందుకు 900 కిమీ కష్టపడి రైల్లో వచ్చారు.. పోలింగ్ కేంద్రానికి వెళ్లినా, అయ్యో పాపం Tue, May 14, 2024, 09:16 PM
ఈవీఎంలలో పోలైన ఓట్లు ఎన్నిరోజులు ఉంటాయో తెలుసా Tue, May 14, 2024, 09:12 PM
కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని భార్యతో కలిసి సందర్శించిన పవన్ కళ్యాణ్ Tue, May 14, 2024, 09:07 PM
ఏపీలో ఆగని దాడులు.. తాడిపత్రి, చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. సీన్‌లోకి చంద్రబాబు Tue, May 14, 2024, 09:02 PM