పెళ్లి చేయట్లేదని తల్లిదండ్రులపై యువకుడు ఫిర్యాదు

by సూర్య | Sat, May 14, 2022, 03:32 PM

రకరకాల సమస్యలతో పోలీసులను చాలా మంది బాధితులు ఆశ్రయిస్తుంటారు. అయితే ఓ యువకుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులకు ఏం చేయాలో తోచలేదు. ఆ యువకుడు తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టడం పోలీసులను నివ్వెబోయేలా చేసింది. ఫిర్యాదులో అతడు పేర్కొన్న కారణం చూసిన పోలీసులు అవాక్కయ్యారు. తనకు పెళ్లి చేయట్లేదని తన తల్లిదండ్రులపై అతడు కేసు పెట్టడం చూసి అంతా నోరెళ్లబెట్టారు. పెళ్లికి లేట్ చేస్తున్నారని, అయితే తాను ఏ మాత్రం లేట్ చేయలేనని పేర్కొంటున్నాడు. ఈ ఆసక్తికర అంశం గురించిన వివరాలిలా ఉన్నాయి.


ఉత్తరప్రదేశ్‌లోని శామ్లి జిల్లా కేంద్రానికి చెందిన అజీమ్ మన్సూరీ (26) గతంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. మూడు అడుగుల రెండు అంగుళాల‌ పొడవు ఉండే అతడిని మరగుజ్జు అంటూ ఎవరూ పిల్లనివ్వడం లేదని గతంలో వాపోయాడు. అప్పట్లో ఈ అంశంపై కేసు పెట్టిన అతడు తాజాగా తన తల్లిదండ్రులపైనే తాజాగా కేసు పెట్టాడు. తనకు ఇంత కాలం పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకలేదని, తీరా ఇప్పుడు దొరికితే తన తల్లిదండ్రులు పెళ్లి చేయకుండా వాయిదా వేస్తున్నారని వాపోయాడు. ఏడాది క్రితం హాపుఢ్ జిల్లా కేంద్రానికి చెందిన యువతితో తనకు పెళ్లి నిశ్చయమైందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తన పెళ్లి చేయకుండా తల్లిదండ్రులు మరికొంత కాలం ఆగాలని చెబుతున్నారన్నాడు. వారు చెప్పినంత కాలం ఆగే ఓపిక తనకు లేదని, తనకు పెళ్లి జరగకుండా చేస్తున్న తల్లిదండ్రులపై కేసు పెట్టాలని ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అతడిని సముదాయించారు. అతడి తల్లిదండ్రులతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM