జగనన్న కాలనీలోకి నీరు తలలు పట్టుకుంటున్న అధికారులు

by సూర్య | Sat, May 14, 2022, 09:45 AM

చెన్నూరు మండలం కనుపర్తి జగనన్న కాలనీలోకి మరోసారి వర్షపు నీరు చేరింది. కాలనీలోకి నీరు రావడంతో స్థానిక అధికారులు స్థలాలను పరిశీలించి తలలు పట్టుకుంటున్నారు. అయితే లబ్ధిదారులు మాత్రం ఈ స్థలాలు తమకు వద్దంటూ స్థానిక అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో కనపర్తి కొండ ప్రాంతం నుంచి వస్తున్న వర్షపునీరు ఇతర పొలాల నుంచి వస్తున్న నీరు జగనన్న లే అవుట్ చుట్టూ నీరు ప్రవేశించడంతో ఇళ్ల స్థలాలు పూర్తిగా నీట మునిగాయి.


గతంలో పర్యటించిన జిల్లా అధికారులు ఈ స్థలాలు పనికిరావు చెప్పడం జరిగింది. కానీ ఇటీవల ప్రజా ప్రతినిధులు అధికారులు ఆ స్థలాలను పరిశీలించి స్థలాలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ ఖర్చుతో ఎత్తు లేపి గృహ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మూడు రోజుల కిందట ఆర్డిఓ ధర్మ చంద్రారెడ్డి స్థలాన్ని పరిశీలించి త్వరగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరడం జరిగింది. అధికారులు వచ్చి చూసి పోయిన వెంటనే తుఫాన్ ప్రభావంతో వర్షాలతో జగనన్న కాలనీ నీటమునిగింది.


రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవడంతో నీటమునిగిన కనుపర్తి జగనన్న లేఅవుట్ ఇళ్ల స్థలాలు పరిశీలించడానికి శుక్రవారం స్థానిక అధికారులు అక్కడికి వెళ్లారు. కనపర్తి జగనన్న కాలనీ నీటమునిగిన స్థలాలను పరిశీలించేందుకు మండల అభివృద్ధి అధికారి మహబూబ్ బి, మండల డిప్యూటీ తాసిల్దార్ రాజేష్, హౌసింగ్ అధికారి శ్రీనివాసులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు స్థలాలను పరిశీలించారు. నీటమునిగిన ఇళ్ల స్థలాలు చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఏం చేయాలన్నా ఆలోచనలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


ఒకవైపు ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ఒకవైపు జిల్లా అధికారుల ఒత్తిడి కారణంగా కనపర్తి ఇళ్ల స్థలాలు ఎత్తు పెంచి ఇల్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తేవడంతో దిక్కుతోచని పరిస్థితిలో స్థానిక అధికారులు ఉన్నారు. ఒకవైపు ఇళ్ల స్థలాలు వచ్చిన లబ్ధిదారులు అక్కడ తాము ఇల్లు నిర్మించుకో లేమని తేల్చి చెబుతున్నారు. భారీ వర్షాలతో లేఔట్లకు నీరు చేరడంతో గృహాలు నిర్మించుకునేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఏది ఏమైనప్పటికీ జిల్లా అధికారులు ఏ చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM