కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం

by సూర్య | Fri, May 13, 2022, 04:33 PM

కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఒక కుటుంబం నుంచి ఒకరికే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌ లో 3 రోజుల పాటు జరగనున్న చింతిన్ శివిర్ కార్యక్రమంలో భాగంగా సోనియాగాంధీ మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.


ఈ సందర్భంగా మోదీ సర్కార్ పై సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు. 2016 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయిందని అన్నారు. మోదీ పాలన కొనసాగితే భవిష్యత్​లో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనకు గురిచేస్తోందని అన్నారు. మినిమం గవర్నమెంట్‌, మ్యాగ్జిమమ్‌ గవర్నెన్స్‌ అని చెప్పారు. దీని అర్థం దేశాన్ని నిట్టనిలువునా చీల్చడం అని సోనియా గాంధీ అన్నారు. మైనార్టీలను బీజేపీ క్రూరంగా అణచివేస్తుందని, గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారని అన్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM