సాంకేతికత పుంతలు తొక్కుతోంది...పెళ్లి ఇలా కూడా చేసుకోవచ్చు మరి

by సూర్య | Tue, Jan 18, 2022, 08:10 PM

ఆర్భాటాలు లేకుండా ఆన్‌లైన్ పెళ్లిళ్లకు నేటి తరం యువతీ యువకులు ఉత్సాహం చూపుతున్నారు. సంప్రదాయానికి టెక్నాలజీని జోడించి.. సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. కోవిడ్ పుణ్యమా అని ఈ పద్ధతికి మద్దతు కూడా లభిస్తోంది. తాజాగా ఓ జంట కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా.. ఎవరిని నొప్పించకుండా వినూత్నంగా వివాహం చేసుకోబోతుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సందీపన్ సర్కార్, అదిథి దాస్ జనవరి 24న పెళ్లి చేసుకోబోతున్నారు. కోవిడ్ కారణంగా గత ఏడాది జరగాల్సిన వీరి పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఈసారి మాత్రం వారు కోవిడ్ నిబంధనలను ఫాలో అవుతూనే తమ వివాహాన్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం వారు ఓ అద్భుతమైన ఆలోచన చేశారు. పెళ్లి కోసం గూగుల్ మీట్‌‌ను ఉపయోగించనున్నారు. సందీపన్, అదిథి తమ పెళ్లి వేడుకను గూగుల్ మీట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి 450 మంది అతిథులను ఆహ్వానించారు. పెళ్లి తేదీకి ఒక రోజు ముందు చుట్టాలకు గూగుల్ మీట్‌లో ఓ లైవ్ లింక్, పాస్ వర్డ్‌ను పంపించనున్నారు. ఆ లింక్ ఓపెన్ చేసి బంధువులు తమ ఇళ్ల నుంచే పెళ్లిని తిలకించి, యువ జంటను ఆశీర్వదించవచ్చు. ఇక భోజనాలు లేకుండా పెళ్లి తంతు ఉండదు. పెళ్లికి విందు భోజనం తప్పనిసరి. దీనికోసం కూడా వారో ఓ ప్లాన్ వేశారు. అతిథులకి వారు జొమాటోలో భోజనం ఆర్డర్ చేసి వారి ఇళ్లకు డెలివరి చేయనున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ మధ్య యువత టెక్నాలజీని ఉపయోగించుకుని వినూత్న పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. తమిళనాడుకు చెందిన ఓ జంట తమ పెళ్లి రిసెప్షన్‌ను మెటావర్స్‌లో వర్చువల్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే మొదలుపెట్టారు.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM