మద్యపాన నిషేధంలో సడలింపుల దిశగా బీహార్ సర్కార్

by సూర్య | Tue, Jan 18, 2022, 08:09 PM

మద్యపాన విషయంలో ఏ ప్రభుత్వం గట్టి చర్యలు  తీసుకోలేకపోతోంది. మద్యపాన నిషేధ చట్టంలోని కొన్ని సడలింపులు చేసేందుకు బీహార్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక నుంచి ఆ రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధించకుండా కొంత ఉపశమనం ఇచ్చే ఆలోచనలో ఉంది. అయితే తొలిసారి చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఎవరైనా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే వారికి ఫైన్ విధించి అక్కడికక్కడే వదిలిపెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే తరచూ ఇలా పట్టుబడితే మాత్రం జైలు శిక్ష విధించనున్నారు. ఇవన్నీ ప్రతిపాదనల్లో ఉన్నట్టు అధికార జేడీయూ వర్గాలు తెలిపాయి. బీహార్‌లో 2016 నుంచి ప్రభుత్వం మద్యనిషేధం అమల్లోకి వచ్చింది. దీనికి ఆర్జేడీ, కాంగ్రెస పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే ఇటీవల కాలంలో ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, బెటియా, సమస్టిపూర్, వైశాలి, నవడా ప్రాంతాల్లో కల్తీ మద్యం చావులు చోటుచేసుకున్నాయి. దాంతో ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. మద్యనిషేధం అమలు పేలవంగా ఉందంటూ విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. దీంతో మద్యనిషేధం చట్టంపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు ప్రభుత్వం చట్టంలో కొన్ని సడలింపులు చేసేందుకు యోచిస్తుంది. కాగా గత నాలుగు నెలల్లో బీహార్‌లో కల్తీ మద్యం సేవించి 80 మందికిపైగా చనిపోయారు. కొంతమంది కంటిచూపు కోల్పోయారు.

Latest News

 
లింగసముద్రం మండలంలో వర్షపు జల్లులు Thu, May 16, 2024, 02:00 PM
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్ Thu, May 16, 2024, 01:58 PM
ఐ ప్యాక్ టీంను కలిసిన సీఎం జగన్ Thu, May 16, 2024, 01:57 PM
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైసీపీ కార్యకర్త Thu, May 16, 2024, 01:05 PM
గిరిజనుల తాగునీటి కష్టాలు తీర్చిన ఎంపిటిసి సభ్యురాలు Thu, May 16, 2024, 12:57 PM