ఎన్టీఆర్ ట్విట్ పై భిన్నవాదనలు

by సూర్య | Tue, Jan 18, 2022, 08:11 PM

చంద్రబాబు, నారా లోకేష్ ఆరోగ్యం గురించి జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్విట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో మూడో వేవ్ ప్రభావం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్ర సీఎంలు కరోనా బారిన పడుతున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్‌లకు పాజిటివ్ అని తేలుతోంది. కోన్ని వందల మంది డాక్టర్లు, పోలీసులకు కరోనా సోకుతోంది. ఇక సినీ ప్రముఖులు అయితే వరుసగా కరోనా బారిన పడుతున్నారు. అలా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఒమిక్రాన్, డెల్టా కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు కూడా కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ కరోనా పాజిటివ్ అని తేలింది. క్వారైంటైన్‌లో ఉన్నాం.. మమ్మల్ని కలిసిన ప్రతీ ఒక్కరూపరీక్షలు చేయించుకోండి.. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ ముందు లోకేష్ ట్వీట్ వేశాడు. ఆ తరువాత కొద్ది సేపటికే చంద్రబాబు నాయుడు కూడా తనకు పాజిటివ్ అన్న విషయాన్ని తెలియపరిచాడు. అయితే ఈ ఇద్దరూ కరోనా బారిన పడ్డారన్న విషయం మీద ఎన్టీఆర్ స్పందింస్తాడా? లేదా? అని నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎదురుచూడసాగారు. మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించాడు. చంద్రబాబు నాయుడు ట్వీట్‌పై ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. చంద్రబాబు నాయుడు మామయ్య గారు, నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. అని ట్వీట్ వేశాడు. ఇక ఈ ట్వీట్ ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. కొందరు అభిమానులు ఈ ట్వీట్ వేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరు మాత్రం ఇవి మనకు అవసరమా?. ఇంకా వాళ్ల గురించి ఎందుకు ట్వీట్ వేయడం అని అభిమానులు హర్ట్ అవుతున్నారు.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM