ఏపీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుతo మంచిది కాదు : పవన్

by సూర్య | Tue, Jan 18, 2022, 04:58 PM

ఈ కరోనా సమయంలో పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుతo మంచిది కాదు అని జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. పిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి.ఈ క్లిష్ట తరుణంలో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోంది. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి.. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలి. అవి లేకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటి? అని నిలదీశారు. అయనప్పటికీ ఏపీ రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో తగదు. కోవిడ్ ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయాలి పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసారు.

Latest News

 
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM
టిప్పు సుల్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం Thu, May 02, 2024, 01:51 PM