కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న ఫ్రాన్స్

by సూర్య | Mon, Jan 17, 2022, 09:11 PM

కరోనా నియంత్రణ కోసం విధించిన నిబంధనలను ఫ్రాన్స్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ను తమ భూభాగం నుంచి తిప్పి పంపడం తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేందుకు వచ్చిన జకోవిచ్ ను నిబంధనల మేరకు ఆస్ట్రేలియా వర్గాలు నిర్బంధించాయి. ఈ క్రమంలో అతడి వీసా రెండు పర్యాయాలు రద్దయింది. ఫెడరల్ కోర్టులోనూ జకోవిచ్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాంతో అతడు స్వదేశం సెర్బియాకు తిరిగి వెళ్లాడు. ఇదిలావుంటే ఫ్రాన్స్ లోనూ కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులను తమ గడ్డపై అడుగుపెట్టనివ్వబోమని ఫ్రాన్స్ వర్గాలు అంటున్నాయి. మే నెలలో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ జరగనుండగా, వ్యాక్సిన్ తీసుకోకపోతే జకోవిచ్ ను ఫ్రెంచ్ ఓపెన్ లో ఆడనివ్వబోమని ఫ్రాన్స్ క్రీడల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాజాగా రూపొందించిన వ్యాక్సిన్ చట్టంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పింది. తాజా వ్యాక్సిన్ చట్టానికి ఫ్రాన్స్ పార్లమెంటు ఆదివారం నాడు ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం... ఫ్రాన్స్ లో రెస్టారెంట్లు, కేఫ్ లు, సినిమా హాళ్ల వంటి బహిరంగ ప్రదేశాలు, దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలోకి అనుమతించాలంటే, కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో క్రీడల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, తమ చట్టం ప్రకారం ప్రేక్షకుడికి అయినా, క్రీడాకారుడికి అయినా నిబంధనలు ఒకేలా వర్తిస్తాయని పేర్కొంది.

Latest News

 
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM
దగ్గర పడుతున్న పోలింగ్.. చంద్రబాబుపై మరో కేసు.. ఏ2గా నారా లోకేష్ Sun, May 05, 2024, 08:23 PM
డ్రామా అనుకుంటే మీరూ చేయండి.. రాళ్లదాడి ఘటనపై జగన్ సతీమణి భారతి రియాక్షన్ Sun, May 05, 2024, 08:18 PM
సజ్జలకు షాక్.. టీడీపీ ఫిర్యాదుపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణకు ఆదేశం Sun, May 05, 2024, 08:15 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అద్భుత అవకాశం.. సొంతంగా సేవ చేసే ఛాన్స్ Sun, May 05, 2024, 07:43 PM