ఒమిక్రాన్ మామూలు వేరియంట్ కాదు...కాస్త జాగ్రత్త

by సూర్య | Mon, Jan 17, 2022, 03:57 PM

కరోనా వైరస్ అయితే సాధారణంగా అయితే ఒకరు గంట వ్యవధిలో ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు. లక్షణాలు వృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ, మేము చూస్తున్నది ఏమిటంటే కుటుంబ సభ్యులు అందరిలోనూ ఏక కాలంలో లక్షణాలు బయటపడుతున్నాయి. అని ఒమిక్రాన్ వేరియట్ గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ రకం చాలా వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు. కానీ, సాధారణ ప్రజానీకం దీన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు.  వారి నిర్లక్ష్యంతో కుటుంబంలో అందరూ ఏకకాలంలో కరోనా వైరస్ బారిన పడే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ‘‘సాధారణంగా అయితే ఒకరు గంట వ్యవధిలో ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు. లక్షణాలు వృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ, మేము చూస్తున్నది ఏమిటంటే కుటుంబ సభ్యులు అందరిలోనూ ఏక కాలంలో లక్షణాలు బయటపడుతున్నాయి. అంటే వారు ఒకే సమయంలో ఇన్ఫెక్షన్ కు గురి అయినట్టు తెలుస్తోంది’’అని అపోలో హాస్పిటల్స్ ఫిజీషియన్ డాక్టర్ ఆశిష్ చౌహాన్ సూచించారు. ‘‘కుటుంబ సభ్యులు అందరూ కలసి పరీక్ష కోసం వస్తున్నారు. గంటల వ్యవధిలోనే తమకు లక్షణాలు కనిపించినట్టు వారు చెబుతున్నారు. అయితే కొందరిలో లక్షణాలు కనిపించడం లేదు. కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చిందని వారు కూడా వచ్చి పరీక్ష చేయించుకుంటున్నారు’’అని హైదరాబాద్ లోని ప్రముఖ ప్రభుత్వ కరోనా చికిత్సా కేంద్రం వర్గాలు తెలిపాయి. ఇంట్లో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు అందరూ మాస్క్ లు ధరించడం మంచిదని డాక్టర్ ఆశిష్ చౌహాన్ సూచించారు. తద్వారా వేగంగా వ్యాపించే గుణం ఉన్న ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించుకోవచ్చన్నారు.

Latest News

 
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM
టీడీపీ విజయాన్ని వైసీపీ ఆపలేదు: బిఎన్ విజయ్ Mon, May 06, 2024, 03:46 PM