కాలుష్యం వల్లే పిల్లల మరణాలు అధికం

by సూర్య | Mon, Jan 17, 2022, 03:40 PM

భారత్ లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం గర్భిణులు, గర్భంలోని శిశువులకు చేటు చేస్తోంది. గర్భిణులు చివరి మూడు నెలల కాలంలో పరిసరాల్లోని సూక్ష్మ ధూళి కణాల (పార్టిక్యులేట్ మేటర్/పీఎం 2.5) ప్రభావానికి ఎక్కువగా గురైతే.. గర్భంలోని శిశువులకు ప్రాణాంతకంగా మారుతున్నట్టు ఒక అధ్యయనం గుర్తించింది. అంతేకాదు చివరి మూడు నెలల్లో కాలుష్యానికి ఎక్కువగా గురైతే ప్రసవం తర్వాత.. తొలినాళ్లలో శిశువులకు ప్రాణ ప్రమాదం ఉంటున్నట్టు తేలింది. ఈ అధ్యయనానికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో నేతృత్వం వహించగా, ఐఐటీ ఢిల్లీ సైతం సహకారం అందించింది. క్యూబిక్ మీటర్ గాలిలో పెరిగే ప్రతి 10 మైక్రో గ్రాముల పీఎం2.5 కణాలతో శిశువుల్లో మరణాలు రేటు 1.6 శాతంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా మగ శిశువులతో పోలిస్తే ఆడ శిశువుల్లో కాలుష్యకారక మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు తెలిపారు. భారత్ లో శిశు మరణాల రేటును తగ్గించేందుకు తక్షణమే వాయు కాలుష్య నివారణ ప్రణాళికలను అమలు చేయాలని అధ్యయనకారులు సూచించారు. గర్బిణులు చివరి మూడు నెలల సమయంలో కాలుష్య ప్రభావానికి లోను కాకుండా చూసుకుంటే.. తల్లితోపాటు శిశువుకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటున్నాయని అధ్యయనంలో పాల్గొన్న సాగ్నిక్ డే తెలిపారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM