రైల్వేలో రూ.44 వేల వేతనంతో జాబ్స్

by సూర్య | Mon, Jan 17, 2022, 01:46 PM

రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తాజాగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు మీ కోసం..


మొత్తం భర్తీ చేయనున్న ఖాళీలు: 75
-స్టాఫ్ నర్స్: 49
-ఫార్మసిస్ట్: 4
-డ్రెస్సర్ (Dresser):6
-ఎక్స్ రే టెక్నీషియన్:3
-డెంటల్ హైజనిస్ట్:1
-లాబ్ సూరింటెండెంట్:2
-ల్యాబ్ అసిస్టెంట్:7


ఫిజియోథెరపిస్ట్:1


-రిఫ్రాక్షనిస్ట్ (Refractionist):1


-ఆడియో కమ్ స్పీచ్ థెరపిస్ట్:1


*కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ హాస్పిటల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, బిలాస్పూర్ లో పని చేయాల్సి ఉంటుంది.


*విద్యార్హతల వివరాలు:


-స్టాఫ్ నర్స్: బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.


-ఫార్మసిస్ట్: ఫార్మసీలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.


-డ్రెస్సర్: టెన్త్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.


-ఎక్స్ రే టెక్నీషియన్: సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.


-డెంటల్ హైజనిస్ట్: డెంటల్ హైజీన్ విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.


-ల్యాబ్ సూపరింటెండెంట్: బయో కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ, లైఫ్ సైన్స్ లో బీఎస్సీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.


*అభ్యర్థులు ఇతర పూర్తి విద్యార్హతల వివరాలను, అనుభవానికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.


వేతనాల వివరాలు:


ఈ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.19,900 నుంచి రూ.44,900 వరకు వేతనం చెల్లించనున్నారు.


*ఎంపిక ప్రక్రియ: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కింది తెలిపిన తేదీల్లో office of the Medical Director, Central Hospital, SEC Railway, Bilaspur చిరునామాల్లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.


ఇంటర్వ్యూ తేదీలు:


-స్టాఫ్ నర్స్: జనవరి 18, 19, 20, 21.


-ఫార్మసిస్ట్, ఎక్స్ రే, టెక్నీషియన్ అండ్ డ్రెస్సర్: జనవరి 22.


-ల్యాబ్ సూపరింటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, డెంటల్ హైజనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆడియో కమ్ స్పీచ్ థెరపిస్ట్, రిఫ్రాక్షనిస్ట్: జనవరి 24, 25.


ఇతర వివరాలు: బయో డేటా ఫామ్ డౌన్ లోడ్ కోసం లింక్: https://secr.indianrailways.gov.in/view_section.jsp?fontColor=black&backgroundColor=LIGHTSTEELBLUE&lang=0&id=0,4

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM