లార్వా దశలోనే దోమలను గుర్తించండి

by సూర్య | Sun, Jan 16, 2022, 10:34 AM

కీటక జనిత వ్యాధులతో అందరూ అప్రమత్తంగా ఉండాలని, దోమల ద్వారా వచ్చు మలేరియా, డెంగ్యూ, అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్. సుందర్ కుమార్ తెలియజేశారు. విజయవాడ రూరల్ సబ్ యూనిట్ ఆఫీసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దోమలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా అనగా లార్వా దశలోనే గుర్తించి యాంటీ లార్వా మెజర్స్ పాటిస్తే దోమల వృద్ధిని నియంత్రించవచ్చని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో స్థానిక ఆరోగ్య కేంద్ర ఎంపీహెచ్ ఈ ఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజు ఇంటింటిని సందర్శించి ఇంటి చుట్టు పక్కల కొబ్బరి బోండాలు, పాడైపోయిన పాత ఫ్రిజ్ లు, కూలర్లు , పాత టైర్లు వంటివి లేకుండా చూసుకోవాలని, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి తొట్టెలు, పాత్రల లో నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని అన్నారు. ప్రజల కు దోమల నివారణ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా. అజ్మత్ తెహ్రా, హెల్త్ సూపర్


లు, శారమ్మ, శ్యామల హెల్త్ అసిస్టెంట్లు రాచమల్లశ్యాంప్రసాద్, శ్రీధర్ కుమార్ , రాజేంద్ర ప్రసాద్ ఏ. ఎన్. ఎం. లు విలేజ్ హెల్త్ సెక్రటరీలు. ఆశాలు పాల్గొన్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM