కరోనా ముప్పు.. మరో వేరియంట్

by సూర్య | Sun, Jan 16, 2022, 10:36 AM

కరోనా ముప్పు మరో వేరియంట్ రూపంలో ముంచుకొస్తోంది. కృష్ణా జిల్లాలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగు తున్నాయి. ఈ క్రమంలో వైరస్ కట్టడికి ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. అయితే జనం వైరస్ వ్యాప్తిని లెక్కచేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.


చాలా మంది మాస్కులు లేకుండానే బయట తిరుగుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ వంటి సంస్థలు సైతం కరోనా వచ్చిన తర్వాత బాధపడే కంటే, రాకుండా జాగ్రత్త పడటమే మేలని సూచిస్తున్నాయి.


ఆయా సంస్థలు చెబుతున్న కొన్ని జాగ్రత్తలు, సూచనలు: అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జన సమూహంలోకి వెళ్లాలి. లేదంటే ఇంట్లోనే ఉండటం క్షేమకరం. మాస్కులేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదు. క్యాన్సర్, గుండె జబ్బులు, క్షయ, హెచ్ఐవీ,


హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జనంలోకి అసలే వెళ్లకూడదు. బాలింతలు, చిన్నారులు, గర్భిణులు కూడా ఇంట్లోనే ఉండాలి. కరోనా పాజిటివ్ అనగానే బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. పారాసెట్మాల్, అజిత్రోమైసిన్ వంటి మందులు ఇంట్లో ఉంచుకుని డాక్టర్ సలహామేరకు వేసుకోవచ్చు. బాగా ఇబ్బంది అనిపిస్తే 104కు కాల్ చేయాలి. డాక్టర్ ఫోన్లోనే వివ రాలు తెలుసుకుని మందులు సూచిస్తారు.


డి విటమిన్ తగ్గకుండా చూసుకోవాలి. కరోనా సోకిన సమయంలో డి విటమిన్ లోపం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉదయం పూట సూర్యకిర ణాల ద్వారా డి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. సమతుల్య ఆహారం అవసరం. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలు, పండ్లు, చిరుధాన్యాలు వంటివి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉండే రైస్ కంటే జొన్న, రాగి, కొర్ర వంటివి తీసుకోవడం మంచిది. మొలకెత్తిన గింజలు, రోజూ కనీసం వంద గ్రాములు తీసుకుంటే మంచిది. ప్రోటీన్లు కోసం గుడ్లు, చికెన్ తినొచ్చు. అన్నింటికంటే వ్యాయామం ముఖ్యం. బయటకు వెళ్లి వాకింగ్ చేయలేని పరిస్థితి ఉంటే, ఇంట్లోనే రోజూ 30 నిమిషాలు యోగా చేయడం మంచిది.


ఇంట్లో ఇవి ఉంచుకోవాలి: ఇంట్లో పల్స్ ఆక్సీమీటర్ పెట్టుకోవాలి. చిన్నపాటి కరోనా లక్షణాలుంటే దీని ద్వారా ఆక్సిజన్ స్థాయి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఆక్సిజన్ శాతం 96 కంటే తక్కువగా ఉంటేనే డాక్టర్‌ను సంప్రదిం చాలి. జ్వరం తెలుసుకునేందకు థర్మోమీటర్ కూడా ఉంటే ఉపయుక్తం.


ఆర్టీపీసీఆర్ పరీక్ష మేలు: ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు బయట షాపుల్లో దొరుకుతుండటంతో ఎక్కువగా ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. కానీ ఆర్టీపీసీఆర్ కచ్చితమైన నిర్ధారణ పరీక్ష. జ్వరం, జలుబు, బాడీ పెయిన్స్, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే వెం టనే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. మనకు లక్షణాలు లేక పోయినా పాజిటివ్ వ్యక్తితో కలిసినప్పుడు టెస్ట్ చేయించుకోవడం మంచిది.

Latest News

 
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM
వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు,,,షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ Thu, Apr 25, 2024, 07:25 PM