ఈ పరికరంతో ఇంట్లోనే 6 రకాల టెస్టులు.. ధర ఎంతో తెలుసా?

by సూర్య | Sun, Jan 16, 2022, 09:20 AM

రక్త నమూనాలు అవసరం లేకుండానే షుగర్ టెస్ట్ చేసే పరికరాన్ని గచ్చిబౌలిలోని బ్లూసెమీ సంస్థ ఆవిష్కరించింది. అరచేతిలో ఇమిడిపోయే ఈ చిన్న పరికరంతో ఇంట్లోనే ఆరు రకాల వైద్య పరీక్షలు చేసుకునే అవకాశం ఉంటుంది. ‘ఐవా’ పేరుతో రూపొందించిన ఈ పరికరం అన్ని పరీక్షలు దాటుకుని విజయవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. వచ్చే మార్చిలో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరికరం సాయంతో బ్లడ్‌ గ్లూకోజ్‌, ఈసీజీ, గుండె వేగం, బీపీ, ఎస్‌పీవో2, టెంపరేచర్ తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ తో బ్లూటూత్ సాయంతో ఈ పరికరాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అనంతరం పరికరాన్ని అరచేతితో పట్టుకుని 60 సెకన్లు ఉంటే వైద్య పరీక్షల ఫలితాలు యాప్‌లో ప్రత్యక్షమవుతాయి. ఫలితాలను ప్రకటించడమే కాకుండా చిన్నపాటి సూచనలు కూడా చేస్తుంది. దీని ధరను రూ.15,490గా నిర్ణయించినట్లు సంస్థ పేర్కోంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM