ఏపీలోని ఆ రెండు జిల్లాల్లో కరోనా టెన్షన్.. లాక్ డౌన్ సూచనలు!

by సూర్య | Sun, Jan 16, 2022, 09:18 AM

ఆంధ్రప్రదేశ్ లో కరోనా హడలెత్తిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా రెండు జిల్లాలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉండటంతో సంక్రాంతి తర్వాత అక్కడ లాక్ డౌన్ విధించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో మొత్తం 4,955 కరోనా కేసులు వెలుగు చూశాయి. అంతుకు ముందు రోజుతో పోల్చితే ఈ సంఖ్య నాలుగు వందలకు పైగా అధికం. అయితే తాజాగా నమోదైన కేసుల్లో రెండు జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అత్యధికంగా విశాఖలో ఎక్కువమందికి కరోనా సోకింది. జిల్లాలో 1103 కేసులు, జిల్లాలో 1039 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి తర్వాత ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పండగ పేరుతో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. వీరిలో ఏ ఒకరిద్దరికి పాజిటివ్ ఉన్నా పెను ప్రమాదానికి దారితీయవచ్చు. దీంతో వైరస్ కట్టడికి మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ ఈ రెండు జిల్లాలో మరింత కఠిన ఆంక్షలు అమలయ్యే సూచనలు ఉన్నాయి.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM